Breaking News

అధికారికంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణదినం నిర్వహణ

-సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్య సంఘాల కృతజ్ఞతలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం ‘మాఘ శుద్ధ విదియ’ తిథి నాడు రాష్ట్ర కార్యక్రమం గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 181 ద్వారా ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్యవైశ్య సంఘాలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎంను కలిసిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును అధికారికంగా నిర్వహించాలని నాడు ఆర్యవైశ్య సంఘాలు కోరగా మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ఇరుకుల రామకృష్ణ, ఆరవీటి నిర్మల, సేగు షణ్ముఘం, ఎంవీబీ, గురు బ్రహ్మం తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *