Breaking News

ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నెల‌వారీ సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లిసి పరిశీలించారు. సీసీ టీవీ కెమెరాలతో గోదాముకు ఏర్పాటు చేసిన క‌ట్టుదిట్ట‌మైన భద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందజేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ, ఎన్నిక‌లు, పోలీస్ త‌దిత‌ర విభాగాల స‌మ‌న్వ‌యంతో ఈవీఎం గోదాము వ‌ద్ద నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో గ‌ట్టి నిఘా పెట్టిన‌ట్లు వివ‌రించారు. తనిఖీలో డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, క‌లెక్ట‌రేట్ కోఆర్డినేష‌న్ సెక్ష‌న్ సూప‌రింటెండెంట్ చంద్ర‌మౌళి, ఎల‌క్ష‌న్ డిప్యూటీ త‌హ‌సీల్దార్ గోపాల్‌రెడ్డితో పాటు వై.రామ‌య్య (టీడీపీ), రాజా (బీజేపీ), ఏసుదాసు (ఐఎన్‌సీ) తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *