Breaking News

రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కి దక్కిన అరుదైన గౌరవం

-కేంద్ర మంత్రితో పాటుగా వేదికను పంచుకునే అవకాశం
-పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు కూటమిగా పని చేస్తున్నాయి…మంత్రి వాసంశెట్టి సుభాష్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర కార్మిక మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ కి దక్కిన అరుదైన గౌరవం, న్యూఢిల్లీలో జరుగుతున్న అఖిల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రితో పాటుగా వేదికను పంచుకునే అవకాశం దక్కడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేసారు. వేదిక పైన అన్ని రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్మిక సంస్కరణలలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ముందంజలో ఉందని, విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కార్మిక సంస్కరణలు 2015 నుండే అమలు చేశారని వాటినే ఇప్పుడు కేంద్రము చాలావరకు అమలు చేస్తుంది అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పెట్టుబడుల ఆకర్షణతో పారిశ్రామికీకరణలో ముందంజలో ఉండడంతో పాటు కార్మికుల సంక్షేమం పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహిస్తుందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా 4000 నుండి 15000 వరకు పెన్షన్లను అందిస్తున్నారని, ఇది దేశంలోనే అత్యధికమని, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు బీమా అందిస్తున్నారని ఇది కూడా దేశంలోనే అత్యధికమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి పేదల ప్రజల పట్ల కార్మికుల పట్ల ఉండే నిబద్ధతకు ఇది నిదర్శనం అని కేంద్రమంత్రి కొనియాడారు. ప్రస్తుతం కేంద్రం అమలు చేయాలనుకుంటున్న చాలావరకు కార్మిక సంస్కరణలు 2015 లోనే చంద్రబాబు నాయుడు అమలు చేయడం ఆయన విజనరీ నాయకత్వానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కొనియాడారు అని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర సాధన -2047 లక్ష్యంగా ఒక విజన్ తో పనిచేస్తున్నారన్నారు. వికసిత్ భారత్ లో స్వర్ణాంధ్రను భాగ్యస్వామ్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, అభివృద్దే తారక మంత్రంగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏటువంటి చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో కార్మికుల భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఏ రాష్ట్రానికి లేని విధంగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఎన్నో విషయాలను పొందుపరిచి రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని , రాష్ట్రంలో పరిశ్రమ ప్రోత్సాహకాల విషయంలోను, ఉద్యోగ అవకాశాల విషయంలోను ప్రణాళిక బద్దంగా సాగుతున్నాం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు కూటమిగా పని చేస్తున్నామని మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *