Breaking News

కబేళాను మరింత అభివృద్ధి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కబేళను మరింత అభివృద్ధి చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కబేళ, వైవిఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కబేళాను మరింత అభివృద్ధి చేయాలని, కబిలాలు కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం పరుచుకోవాలని, నిత్యం వ్యర్థ నిర్వహణ చేస్తుండాలని అన్నారు. 58వ డివిజన్లో గల వైవిఆర్ ఎస్టేట్లో నిర్మాణం దశలో ఉన్న 1500 కిలో లీటర్ల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ను పరిశీలించారు. అమృత్ పథకం 2.0 లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా దానికనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని అన్న క్యాంటీన్ పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవాలని అన్నారు. తదుపరి ఎంజీ రోడ్డులోని పారిశుధ్య నిర్వహణ పరిశీలించి పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని అన్నారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, మెడికల్ హెల్త్ ఆఫీస్ డాక్టర్ సురేష్ బాబు, సుప్రింటెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *