Breaking News

నగరంలో నవీకరించిన “జోస్ అలుక్కాస్” షోరూమ్ ప్రారంభం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో విస్తృత స్థాయిలో నవీకరించిన జోస్ అలుక్కాస్ షోరూమ్ పున ప్రారంభించబడినది. నగరంలో ఎంజీ రోడ్డు లో శనివారం తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించబడినది. సెలబ్రిటీ అతిథిగా సినీ నటి సభానటేష్ , జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు , వరీ్్ఘస్ అలుక్కాస్ , పాల్ జె .అలుక్కాస్ ,మరియు జాన్ అలుక్కాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోస్ అలుక్కాస్ చైర్మన్ మాట్లాడుతూ కొత్తగా నవీకరించిన షోరూం సాంప్రదాయం ,ఆధునిక డిజైన్లతో ఒక విశిష్టమైన ఆభరణాల కొనుగోలు అనుభవాన్ని అందిస్తుందని, ఆయన అన్నారు .ఈ గొప్ప ప్రారంభాన్ని వేడుక చేసుకోవడం కోసం బంగారు ఆభరణాల తరుగు చార్జీ మీద ప్లాట్ 50% తగ్గింపును జోస్ అలుక్కాస్ అందిస్తుందని, అదనంగా ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లను కూడా బ్రాండ్ ప్రవేశపెట్టిందని, వీటిలో వజ్రాల ఆభరణాల మీద ప్రతి క్యారెట్ కు రూ.15,000 తగ్గింపు ,ప్రతి క్యారెట్ వజ్రాల కొనుగోలు పై ప్రోత్సాహకంగా 500 మిల్లి గ్రాములు బంగారు నాణెం లాంటివి ఉన్నాయని, అలాగే ప్లాటినం ఆభరణాలపై7% తగ్గింపును, వెండి నగలకు తరుగు చార్జీలు పూర్తిగా లేకుండాను, వివాహ కొనుగోలు కోసం ఉద్దేశించిన ప్రత్యేక తగ్గింపులను కూడా వినియోగదారులు పొందవచ్చని, ప్రతి కొనుగోలుపై ఒక బహుమతిని అందించడం జరుగుతుందని, అంతేకాకుండా తమ పాత బంగారాన్ని సరికొత్త హెచ్ యు ఐ డి. హల్ మార్క్ కలిగిన బంగారు ఆభరణాలతో ఎక్స్చేంజ్ చేసుకోవాలని కోరుకునే, వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను జోస్ అలుక్కాస్ అందిస్తుందని, అన్నారు. విజయవాడ ప్రజలకు బంగారం, వజ్రాలు, మరియు ప్లాటినం ఆభరణాల అత్యుత్తమ కలెక్షన్లను అందిస్తామని ఈ షోరూం హామీ ఇస్తుందని వివాహాల నుంచి రోజు వారి అలంకరణల వరకు ప్రతి సందర్భానికి ఇవి అనుకూలంగా ఉంటాయని, ఆయన అన్నారు. కొత్త షోరూమ్ సందర్శించి బ్రాండ్ తీర్చి దిద్దిన చక్కదనాన్ని మరియు హస్తకళ నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసి అనుభూతిచెందాలని ఆభరణాల ప్రియులందరిని జోస్అలుక్కాస్ ఆహ్వానిస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జోస్ అలుక్కాస్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *