తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి కేంద్రంగా నూతనంగా ఏర్పడ్డ ‘ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం’ యొక్క లోగో ను ఈరోజు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ లు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంతో పాటు, ఉద్యోగులు ప్రత్యక్ష సామాజిక సేవా చేయాలనే లక్ష్యంతో ఏర్పడ్డ ఈ సంఘంనకు వారు శుభాకాంక్షలు తెలిపారు, అలాగే, సాధ్యమైన పనుల్లో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంఘం కార్యవర్గంలో అధ్యక్షుడు ఎమ్. అన్వర్ బాషా రెవిన్యూ డిపార్ట్మెంట్, ఉపాధ్యక్షుడు పి. స్వామినాథన్ రెవిన్యూ డిపార్ట్మెంట్, ప్రధాన కార్యదర్శి బి. కిరణ్ కుమార్ రెవిన్యూ డిపార్ట్మెంట్, సంయుక్త కార్యదర్శి బి. గోవర్ధన్ యాదవ్ ప్రణాళిక డిపార్ట్మెంట్, కార్యనిర్వాహక కార్యదర్శి ఏ.కే. ప్రేమ్ కుమార్ రెవిన్యూ డిపార్ట్మెంట్, కోశాధికారి ఎమ్. మోహన్ బాబు రెవిన్యూ డిపార్ట్మెంట్, కార్యవర్గ సభ్యులు ఎమ్. అమృత రెవిన్యూ డిపార్ట్మెంట్, ఎన్. వంశీ కృష్ణ రెవిన్యూ డిపార్ట్మెంట్, కే. సుధీర్ కుమార్ పి. ఆర్ డిపార్ట్మెంట్, ఎన్. పవన మూర్తి పి. ఆర్ డిపార్ట్మెంట్, చల్లా మోహన్ రెడ్డి హెల్త్ డిపార్ట్మెంట్ లు ఉన్నారు. అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగుల ఈ సంఘం లో సభ్యత్వం పొందవచ్చని, తమ సభ్యులు శాఖాపరమైన సమస్యలు సంబంధిత పైఅధికారుల ద్వారా పరిష్కరించడం అదేవిధంగా సామాజిక సేవ చేయడం తమ లక్ష్యం అని సంఘం సభ్యులు తెలిపారు.
Prajavartha Online Telugu News