విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సరస్వతీ దేవి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని గాయత్రీ ప్రజ్ఞాపరివార్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిట్టినగర్ లోని బాయన కనకదుర్గాంబ ఆధ్యాత్మిక కేంద్రంలో వసంత పంచమి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ లు ఈ వేడుకలలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరికి లభించాలని కోరారు.
ఆకుల కుమార్ ,బాయన హేరంభ కుమార్ ఆధ్వర్యంలో బాల బాలికలకు సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో సరస్వతి పూజలో పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి నేతలు వెంపలి గౌరీ శంకర్, గడ్డిపాటి కిరణ్, మక్కెన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News