-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు ఆహ్లాదంగా సమయాన్ని గడిపే కేఎల్ రావు పార్క్ లో మరింత అహ్లాద భరితంగా చేసేందుకు యాంఫి థియేటర్ ను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ వద్ద గల కేఎల్ రావు పార్క్, సూరిరావుపేట, వన్ టౌన్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేఎల్ రావు పార్క్ లో యాంఫి థియేటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత అహ్లాదాన్ని అందించాలని, పార్క్ లోపల ఉన్న మరమ్మతులను సత్వరమే పూర్తి చేసి, పార్కు విచ్చేసిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, నిత్యం రద్దీగా ఉండే ఈ పార్క్ లో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
వరదల్లో పాడైపోయిన ఇండోర్ స్టేడియం ను, పునరుద్ధరిస్తున్న పనులను పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలో గల ఫ్లోరింగ్ నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పార్క్ లో జరుగుతున్న లైటింగ్ పనులను పరిశీలించి, మరమ్మతులు వేగవంతం చేయాలని అన్నారు. కే ఎల్ రావు పార్కు ముఖద్వారమును మరింత అందంగా అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బందర్ రోడ్డు, సూర్యారావుపేట ప్రాంతాల్లో అన్ని పర్యటించి పారిశుధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజి మహిళా కళాశాల వద్ద గల అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. నిర్ణీత టోకెన్ నెంబర్లు ఇస్తున్నారా, ఆహార నాణ్యత, కిచెన్ పరిశుభ్రత, అన్న క్యాంటీన్లో గల త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి విషయాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నోడల్ ఆఫీసర్లు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలకుండా చూసుకోవాలని అన్నారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్చార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్) శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News