Breaking News

మంత్రి నారా లోకేష్ కి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వే బ‌డ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని రైల్వే ప్రాజెక్టుల‌కు రూ.9,417 కోట్లు కేటాయించినందుకు కేంద్ర ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో స‌మావేశ‌మై ధ‌న్య‌వాదాలు తెలిపేందుకు ఢిల్లీ విచ్చేసిన విద్య‌, ఐటి శాఖ‌ల మంత్రి నారా లోకేష్ కి మంగ‌ళ‌వారం విమానాశ్ర‌యంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స్వాగ‌తం ప‌లికారు. మంత్రి నారా లోకేష్ కి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి పుట్టా మ‌హేష్ కుమార్, ఎంపి గంటి హరీష్ మధుర్, రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్ ల‌తో క‌లిసి పుష్ప‌గుచ్ఛం అందించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మంత్రి నారా లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *