-కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడి
-మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) కింద 2023-24 ఆంధ్రప్రదేశ్ లో ఆమోదించిన మార్కెట్ మౌలిక సదుపాయాల(మండీలు, రిటైల్ మార్కెట్లు, వెండింగ్ కార్ట్లు) ప్రాజెక్టుల సంఖ్య 608 వుండగా, 2024-25లో ఎమ్.ఐ.డి.హెచ్ పథకం ఎపిలో మంజూరైన మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంఖ్య 1033 గా వుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడించారు. అలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 123 ప్రాజెక్టులు ఆమోదించగా, ఎన్టీఆర్ జిల్లాలో 28 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) పథకం ప్రారంభం నాటి నుంచి ఆమోదించిన మార్కెట్ మౌలిక సదుపాయల ప్రాజెక్టుల సంఖ్య వివరాలు, అలాగే ఎపిలో ఈ పథకం ప్రారంభం నుండి మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం సహాయం పొందిన స్వయం సహాయక సంఘాలు (SHGs), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs), స్థానిక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీల (APMC) సంఖ్యను తెలపాలంటూ కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ను ఎంపి కేశినేని శివనాథ్ మంగళవారం లోక్ సభలో అడగటం జరిగింది.. వీటికి కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు.
ఈ పథకం ప్రారంభం నుంచి ఎపి కి మార్కెట్ మౌలిక సదుపాయాల కోసం చేసిన కేటాయింపులో విడుదల చేసిన నిధుల వివరాలు పేర్కొన్నారు. 2014-15 లో రూ 74.59 కోట్లు కేటాయింపు చేయగా, రూ 64.68 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2024-25 వరకు ఈ పథకం కింద ఎపి కి మొత్తం రూ 703.09 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News