విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గంపలగూడెం మోడల్ స్కూల్ విద్యార్థి సుదక్ష తన ప్రాజెక్టుతో దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ లో పాల్గొని విజేతగా నిలిచినందుకు ఈరోజు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందించడం జరిగినది. జగ్గయ్యపేట జిల్లా పరిషత్తు బాయ్స్ హైస్కూల్ తరఫున పాల్గొన్న ఇద్దరు విద్యార్థులు భార్గవ్, చైతన్య గ్రూపు ప్రాజెక్టుకు దక్షిణ భారత స్థాయిలో అవార్డు రావడంపై జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు. పుదుచ్చేరిలో జనవరి 20 నుంచి 25 వరకు జరిగిన దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్ విజ్ఞాన ప్రదర్శనలో రెండు ప్రాజెక్టులు పాల్గొనగా రెండిటికీ అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ అనేది పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, కేరళ ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్నారు. మోడల్ స్కూల్ తరఫున రోలింగ్ రోబోతో సుదక్ష విజేతగా నిలవగా జగ్గయ్యపేట జిల్లా పరిషత్తు బాయ్స్ హై స్కూల్ తరఫున పాల్గొన్న భార్గవ్, చైతన్య గ్రూప్ వరదలలో వంతెనలు ఏ విధంగా నిర్మించుకోవాలి.. వాహనాలను, ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలనే ప్రాజెక్టు దక్షిణ భారత స్థాయిలో విజేతలుగా నిలిచారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ మైనం హుస్సేన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News