తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు తిరుపతి జిల్లా తిరుపతి అనంత శయనం లెప్రసి కాలని నందు DPMR (డిజెబిలిటి ప్రివెన్షన్ మెడికల్ రిహ్యాబిలిటేషన్) కార్యక్రమము నిర్వహించ బడినది. ఈ కార్యక్రమము లో కుష్టు వ్యాధి వలన అంగవైకల్యము తో బాధ పడే రోగుల గాయాలకు ఆయింట్‌మెంట్ పూసి బ్యాండేజ్ క్లాత్ తో కట్లు కట్టడం జరిగినది. కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలక్రష్ణ నాయక్ ప్రసంగిస్తూ కుష్టు వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాదని ఎవరైతే ఆ జబ్బు తో బాధ పడుతుంటారో వారు దగ్గితే తుమ్మితే రోగకారక క్రిములు నోటి తుంపరల ద్వారా గాలిలో వెదజల్లబడుతాయని అటువంటి కలుషితమైన గాలి పీల్చు కొనిన వారికి వ్యాధి సోకే అవకాశం ఉందని కనుక స్పర్శ లేని మచ్చలు ఉన్నవారు ప్రారంభం లోనే చూపించుకుంటే ఒక వేళ కుష్టు వ్యాధి గా నిర్ధారణ జరిగితే చికిత్స ఉచితంగా అందించ బడునని తెలపారు. కుష్టు వ్యాధి గ్రస్తులకు ఎమ్ సి ఆర్ చెప్పులు ఉచితంగానే ఇవ్వబడునని అవసరమైతే శస్త్ర చికిత్సలు ఉచితం గానే చేస్తారని తెలిపారు. కుష్టు వ్యాధి గ్రస్తులకు కాటన్, బ్యాండేజ్ క్లాత్ ప్రొవిడిన్ ఆయింట్‌మెంట్ ఇతరములు పంపిణి చేయ బడినవి. కార్యక్రమం లో డిఎల్ఎ టిఓ డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి డిఎన్ఎమ్ఓ డాక్టర్ రాజా, ఫిజియోలు వెంకట రమణ శ్రీరాముల నాయక్ లు డి పిఎమ్ఓ లు సుధాకర్ మునిసుబ్బరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News