Breaking News

ఇద్దరు గ్రామ సర్వేయర్ల , 12 మంది డిప్యూటీ తాహాసిల్దార్లు / మండల సర్వేయర్ల కు షో కాజ్ నోటీసు జారీ

-విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలి- జవాబుదారీతనం ఉండాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్షేత్ర స్థాయిలో రీ సర్వే ప్రక్రియను నిర్దుష్టమైన మార్గదర్శకాలను అనుసరించి నిర్ణీత సమయంలో పూర్తి చెయ్యాల్సి ఉంటుందని, అందులో భాగంగా నిర్లక్ష్యం వహించిన అధికారులకు సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.

ఇద్దరు గ్రామ సర్వేయర్లు కి షో కాజ్ నోటీసు జారీ :
నిబంధనలు అనుసరించి సచివాలయం సర్వీసెస్ స్టేటస్ రిపోర్ట్‌ను ధృవీకరించిన తర్వాత, నిర్దిష్ట గ్రామ సర్వేయర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం లేదని జిల్లా యంత్రాంగం దృష్టికి రావడం జరిగిందన్నారు. అధికారిక విధులను నిర్వర్తించడంలో మీ నిర్లక్ష్యం మరియు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడంలో వైఫల్యం వలన జిల్లా పరిపాలనకు ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీసిందన్నారు. వీటిపై వివరణ ఇవ్వాలని రాజానగరం మండలం యర్రంపాలెం గ్రామ సర్వేయర్ వి. రమేష్ కుమార్ లాగిన్‌లో ఐదు పౌర సేవలు, కానవరం గ్రామ సర్వేయర్ వై. గంగరాజు, లాగిన్‌లో నాలుగు పెండింగ్‌లో ఉండడం వల్ల జిల్లా మొత్తం పురోగతిపై ప్రభావం చూపిందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ కి లోబడి వివరణను సమర్పించ వలసిందిగా ఆదేశించడం జరిగిందని తెలిపారు.

డిప్యూటీ తహసీల్దార్ లు/మండల సర్వేయర్లు కు షో కాజ్ నోటీస్ :
పెరవలి , గోపాలపురం , రాజమహేంద్రవరం రూరల్ , చాగల్లు , గోకవరం , కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం , లకి చెందిన 12 మంది మండల సర్వేయర్ లు , డిప్యూటీ తహసీల్దార్ లు బాధ్యతాయుతమైన అధికారులుగా, మీ విధులు బాధ్యతలు నిర్వహించడం లో విఫలమై నా మీరు మీ చట్టబద్ధతను అమలు చేయడంలో విఫలమయ్యారు మరియు రీసర్వే సమస్యల పరిష్కారానికి సంబంధించి జిల్లా కలెక్టర్ , ఉన్నతాధికారుల సూచనలను పాటించక పోవడం, విధులకు సమర్థవంతంగా నిర్వహించక పోవడం మీ నిర్లక్ష్యం మరియు బాధ్యతారాహిత్యాన్ని చూపుతోందని కలెక్టు పేర్కొనడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ని విధివిధానాల ఉల్లంఘన మరియు ఉన్నత అధికారుల ఆదేశాలను పాటించనందుకు మీపై క్రమశిక్షణా చర్య ఎందుకు తీసుకోకూడదో వివరిస్తూ, వ్రాతపూర్వక వివరణను సమర్పించవలసిందిగా షో కాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *