-అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలి
-పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు. వి ఐఏఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 10 వ తేదీన జరిగే ‘పరీక్షా పే చర్చ 2025’లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో చేపట్టిన సంభాషణ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ వీక్షించాలని, ఈ దిశగా పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాలని ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖాధికారులు, డైట్ ప్రిన్సిపాళ్లకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు. వి ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు.
10 ఫిబ్రవరి 2025న (సోమవారం) ఉదయం 11.00 గంటలకు దూరదర్శన్ ద్వారా DD నేషనల్, DD న్యూస్ మరియు DD ఇండియా, రేడియో ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపారు. 8వ ఎడిషన్ పరీక్ష పే చర్చ 2025 కోసం విద్యార్థులతో జరిపే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9వ తరగతి నుండి పాఠశాల విద్యార్థులతో సంభాషణ ఉంటుందని తెలిపారు. https://www.youtube.com/watch?v=G5UhdwmEEls లింక్ ద్వారా ఆన్లైన్లో చూడవచ్చన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షిస్తున్న ఫొటోలను అదే రోజు MyGov పోర్టల్ (https://innovateindia1.mygov.in/)లో అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే సంబంధిత నోడల్ అధికారులు https://forms.gle/wbWVFkyGogvdP6pr8 లింక్లో ఛాయాచిత్రాలను SCERT, APకి అప్లోడ్ చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News