Breaking News

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ రద్దు

-ప్రజలు మీకోసం పోర్టల్ ద్వారా సచివాలయాల్లో అర్జీలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
-కలెక్టర్ పీ. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్‌లకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ జేశారు. కావున ఫిబ్రవరి 10 వ తేదీ పిజిఆర్ఎస్ నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను మీకోసం పోర్టల్ ద్వారా మీ సమీపంలో ఉన్న సచివాలయాల్లో అర్జీలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు.  ఫిబ్రవరి 27 వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా జిల్లా , డివిజన్, మండల స్థాయిలో సోమవారం PGRS సెషన్‌లు రద్దు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు (మార్చి 8 వ తేదీ వరకు) ఈ రద్దు అమలులో ఉంటుంది. ఫిర్యాదుల నమోదు కోసం సమీపంలోని సచివాలయాన్ని సందర్శించండి. • ఎన్నికల కోడ్ ఎత్తివేయబడే వరకు ఫిర్యాదులను సమర్పించడానికి “మీకోసం” ఆన్‌లైన్ పోర్టల్‌ని ఉపయోగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ సమాచారాన్ని తెలియ చెయ్యడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. కావున ప్రజలు వ్యయ ప్రయాసలకు లోనుకాకుండా ఉండేందుకు, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పి జి ఆర్ ఎస్ నిర్వహించడం జరగనందున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అర్జీలు ఇవ్వడానికి కలెక్టిరేట్, డివిజన్, మండల కేంద్రాలకు రావద్దని తెలియ చెయ్యడం జరుగుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *