తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘
కల్తీ ఆహార పదార్థాలు విక్రయం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఆహార భద్రత కంట్రోలర్ అధికారి వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారి ఆదేశాల మేరకు అలిపిరి ప్రాంతంలో మరియు మెట్ల ప్రాంతంలో కల్తీ పసుపు, కుంకుమ ఆహార పదార్థాల విక్రయం జరుగుతోందని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో జిల్లా ఆహార భద్రత కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమానిత కల్తీ పసుపు, కుంకుమ విక్రయిస్తున్న వాటిని సీజ్ చేయడం జరిగిందని, అలాగే వారికి అవగాహన కల్పించడం జరిగిందనీ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మద్దిలేటి, జగదీష్, మునిసిపల్ సతీష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News