విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాల సందర్భంగా సీజ్ చేసిన వాహనాలను పోలీసుస్టేషన్ల నుండి విడుదలచేసే విషయమై విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు సోమవారం సాయంత్రం కృష్ణాజిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆర్. గంగాధరరావును మచిలీపట్నంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏదైనా రోడ్డుప్రమాదం జరిగినపుడు వాహనాల రికార్డులు పరిశీలించి సక్రమంగా ఉంటే పోలీస్ స్టేషన్ లో డ్రైవరుకు బెయిల్ ఇచ్చి వాహనం విడుదల చేయాలని గతంలో డీజీపీ జారీచేసిన ఉత్తర్వులు చల్లపల్లి పోలీస్ స్టేషనులో అమలు కావడం లేదని, ఫిబ్రవరి 2న ఏపీ 39 టి.యు.0305 లారీపై 304ఏ కింద కేసు నమోదుచేసిన పోలీసులు డ్రైవర్ కి బెయిల్ మంజూరుచేసి కూడా లారీని విడుదల చేయలేదని వారు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా డీఎస్పీకి ఫోన్ చేసి మెజిస్ట్రేట్ తో ఆ విషయమై మాట్లాడి లారీని విడుదల చేయాలని ఎస్పీ ఆదేశించారు. లారీ ఓనర్ల జిల్లా సంఘం అధ్యక్షులు నాగుమోతు రాజా, మాజీ అధ్యక్షులు పి.రాఘవేంద్రరావు, రాష్ట్ర లారీ ఓనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు, సభ్యులు ఎ.వి.ఎస్.సి. బోస్, అజయ్ బాబు ఎస్పీ ని కలిసినవారిలో ఉన్నారు.
Prajavartha Online Telugu News