అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.బాపిరెడ్డి, ప్రధాన అర్చకులు అందించారు. ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా రావాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News