Breaking News

సత్యనారాయణపురంలో కోవెల జ్యూయలరీ షోరూమ్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సత్యనారాయణపురంలో ప్రప్రదమంగా కోవెల జ్యూయలరీ షోరూమ్ ను నూతనంగా నెలకొల్పారు. సోమవారం ఈ షోరూమ్ ను హరిహరవీరమల్లు ఫేం నిధి అగర్వాల్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి,కోవెల జ్యూయలరీ షోరూమ్ నిర్వాహకులు రమేష్ దంపతులకు ఆశీర్వచనాలను అందచేశారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సత్యనారాయణపురంలో నూతనంగా కోవెల జ్యువెలరీ షోరూంను ఏర్పాటు చేశారు. ఈ షోరూంను హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ లాంఛనంగా ప్రారంభించి షోరూమ్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలను పరిశీలించారు వాటి నాణ్యత ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కోవెల షోరూమ్ లో ఉన్న అనేక రకాల ఆభరణాలు కనువిందు చేసేలా ఉన్నాయని, మగువల మది దోచే విభిన్న ఆకృతులతో ఆకట్టుకుంటున్నాయని సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. నాకు చెవి రింగులు పై మంచి ఆసక్తి ఉందని, ఎప్పుడు కొత్తవి మార్కెట్లోకి వచ్చినా.. నచ్చితే వెంటనే కొనుగోలు చేస్తానని చెప్పారు. అదే విధంగా మెడలో నాజూకుగా ఉండేలా కొత్త కొత్త వెరైటీ ఆభరణాలు, చేతులకు గాజులు కూడా విభిన్న తరహా మోడల్స్ ను ఇష్టపడతానని చెప్పారు. కోవెల షోరూమ్ లో కూడా తనకు నచ్చిన అనేక ఆభరణాలు ఉన్నాయని, నిజంగా నేటి ట్రెండ్ కు తగిన విధంగా ఇక్కడ బంగారు ఆభరణాలు మెరిసిపోతున్నాయని తెలిపారు. వినియోగదారులు కూడా ఈ సరికొత్త మోడల్స్ ను తిలకించి.. నచ్చిన వాటిని కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, తనకు నచ్చిన ప్రదేశాలలో విజయవాడ నగరం ఒకటని నిధి అగర్వాల్ చెప్పారు. పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు, ప్రభాస్ తో మరో సినిమా ప్రస్తుతం తెలుగులో చేస్తున్నట్లు చెప్పారు. పది రోజుల్లో హరిహరవీరమల్లులో ఒక పాట బయటకు రాబోతుందని, అందరినీ ఆ పాట ఆకట్టుకుంటుందని నిధి అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేసే అదృష్టం తనకు వచ్చిందని, రెండు సినిమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బంగారం వ్యాపారంలో రమేష్ కు ఎంతో అనుభవం ఉందని, కస్టమర్లు ఎంతో నమ్మకంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని చెప్పారు. మన భారతదేశంలో మగువులు ఎక్కువుగా బంగారంపై మక్కువ చూపుతారని, నేటి ట్రెండ్ కు అనుగుణంగా సరికొత్త మోడల్స్ లో కోవెల జ్యూయలరీ షోరూమ్ లు ఆభరణాలను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని కలిగిన సంస్థ నుంచి మరో షోరూమ్ రావడం ఆనందంగా ఉందని బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. బంగారంతో పాటు, వెండి, డైమండ్ ఆభరణాలు కూడా అందుబాటులో ఉన్నాయని, ఇలాంటి నమ్మకైన షోరూమ్ లల్లోనే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే.. మోసపోకుండా ఉంటారని బోండా ఉమ తెలిపారు. ఇదే నమ్మకాన్ని కలిగిస్తూ.. మరింత ఆదరణ పొందాలని కోరుకుంటూ.. రమేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను. తదనంతరం షోరూం నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ తమ షోరూంలో వడ్డాణాలు అరవంకీలు హారాలు నెక్లెస్లు,చోకర్లు, టెంపుల్ జ్యువెలరీ వెండి ఆభరణాలు లభిస్తాయని తెలియజేశారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు ఆభరణాలపై తరుగు మజూరి లేదని ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొన్ని ఆభరణాలపై మైనస్ రెండు శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని మరికొన్ని ఆభరణాలపై ఆరు శాతం నుండి రాయితీ ఇస్తున్నామని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *