-చెన్నై, బెంగళూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు అబివృద్ది కొరకు కొత్తపట్నం గ్రామo (కోట మండలం) తమ్మిన పట్నం (చిల్లకూరు మండలం) లో ప్రభుత్వ భూముల సాగులో ఉన్న రైతులకు నష్ట పరిహారం విడుదల
-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చెన్నై, బెంగళూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు అబివృద్ది కొరకు కొత్తపట్నం గ్రామ (కోట మండలం) తమ్మిన పట్నం (చిల్లకూరు మండలం) లో ప్రభుత్వ భూముల సాగులో ఉన్న రైతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్ట పరిహారం అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు చెన్నై, బెంగళూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు అబివృద్ది కొరకు ప్రభుత్వ భూములు సాగులో ఉన్న రైతులకు నష్ట పరిహారం విడుదల పై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భoగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు వలన, మంచి పరిశ్రమ ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలో పంపించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జి ఓ ఎం ఎస్ నెం. 43 రూ.78,84,83,200 మంజూరు చేసినదని తెలిపారు. సంబంధిత తాసిల్దార్లు సాగులో ఉన్న భూములను సర్వే చేసి ఎలాంటి అవకతవకలు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పరిహారం అందజేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి నెల్లూరు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు విజయ్ భరత్ రెడ్డి, శివ కుమార్, కోట, చిల్లకూరు మండలాల తాసిల్దారులు సర్వేర్లు వీఆర్వోలు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News