Breaking News

వసతి గృహ సంక్షేమ అధికారులకు సమీక్షా సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నందు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి ఎం ఎస్ శోభారాణి జిల్లా నందలి వసతి గృహ సంక్షేమ అధికారులకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు దృష్ట్యా సాంఘిక సంక్షేమ శాఖ ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో ప్రస్తుతం మెనూ ప్రకారం అమలులో ఉన్న వారానికి 3 రోజులు చికెన్, 6 రోజుల కోడి గ్రుడ్లు మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 2 రోజులు చికెన్, 6 రోజులు గ్రుడ్లు సరఫరా చేయుట నిలుపుదల చేశామన్నారు. వాటి స్థానంలో ఉదయం అల్పాహారం లో పాలు బూస్ట్ మరియు ఆదివారము మటన్ కర్రీ ఏర్పాటు చేయుటకు సూచనలు ఇవ్వడం జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *