Breaking News

ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం విక్రయ రాకెట్ భగ్నం

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను అధికారులు గుర్తించి భగ్నం చేశారు. నిందితుల ఒప్పుకోలు ఆధారంగా, మద్యం సరఫరా చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అప్పేరు వైన్ షాప్ కూడా ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చబడింది. ఈ ఘటనపై క్రైమ్ నంబర్లు 32/25 మరియు 33/25 కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, 22 (180 మిల్లీ లీటర్ల) మద్యం సీసాలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *