Breaking News

మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్ప్, యస్ పి వై ఎమ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో మాదక ద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టేందుకు నిర్వహించిన “నవచేతన” కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. కే బీఎన్ కళాశాలలో ప్రారంభమైన అవగాహన కార్యక్రమం లో రెండో రోజు కూడా పశ్చిమ లోని వివిధ కళాశాలల, పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ ట్రైనర్లు గ్యారీ రైడ్,బీలాల్ అహ్మద్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ ల మోటివేషన్ తో అధ్యాపకులు, ఉపాధ్యాయులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉపాధ్యాయులకు శిక్షణను ఇవ్వటం సంతోషకరమన్నారు. ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మత్తు పదార్థాలు వినియోగం అధికంగా ఉందని ఇది ఒక సామాజిక సమస్యగా పరిగణిస్తుందన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసి ఉపాధ్యాయుల్లో, తల్లిదండ్రులలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యులను చేయడం ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించవచ్చు అన్నారు. సుజనా ఫౌండేషన్ ఆపరేషన్స్ హెడ్ వీరమాచనేని కిరణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని మాదకద్రవ్యరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం ద్వారా మాదకద్రవ్యాల వినియోగాల వలన కలిగే నష్టాలను విద్యార్థి దశ నుంచి వివరించి చెడు వ్యసనాలను దూరం చేయొచ్చన్నారు. ఈ సెమినార్ లో క్రిస్ప్ స్వచ్ఛంద సంస్థల సిబ్బంది మనీషా, నేహా, సుజనా ఫౌండేషన్ సిబ్బంది హరీష్, చింతాసృజన్, మంతెన తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *