కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రీ సర్వే ప్రక్రియలో భాగంగా భూహక్కు దారుల అర్జీలను త్వరితగతిన పరిష్కరించి, సంబంధించిన ధృవ పత్రాలను అందచెయ్యడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. బుధవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు మండలం కు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సరిచేసిన ధ్రువ పత్రాలను అందచెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జేసీ చిన్న రాముడు మాట్లాడుతూ, అర్జీ దారులు సంతృప్తి చెందేలా రెవిన్యూ, సర్వే కి సంబంధించిన వివరాలు సరిచేసి, వ్యక్తిగతంగా అందచేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వొస్తున్న అర్జీలలో 90 శాతం పైగా రెవిన్యూ అనుబంధ అర్జీలు ఉండడం జరుగుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దిశా నిర్దేశం లో అర్జీల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు కొవ్వూరు మండలం లో వొచ్చిన సమస్యలను పరిష్కారం చేసినట్లు తెలిపారు. ఎల్పీ నంబర్, విస్తీర్ణం, సర్వే నంబర్ , కొరిలెషన్ వివరాలు, పోర్టింగ్ , పట్టా , రెగ్యులర్ ఖాతా మార్పు తదితర వివరాలను సరిచేసి, వాటి వివరాలు ఆన్లైన్ లో నమోదు చెయ్యడం జరిగిందని తెలిపారు. అర్జీ దారులు సమస్య పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం చొరవను స్వాగతించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు తహసీల్దార్ ఎం. దుర్గా ప్రసాద్, ఇతర సిబ్బంది, అర్జీ దారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News