Breaking News

మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట

-ప్రతి భక్తునికి పూర్తి సంతృప్తికరమైన దర్శనమయ్యేవిధంగా చూసేలా చర్యలు తీసుకుంటున్నాము.
-కోటప్పకొండ లో ఘనంగా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం.
-కోటప్పకొండ లో జరిగే శివరాత్రి వేడుకలు ప్రభలతో ప్రభవిల్లెల ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నాం
-కోటప్పకొండ మహా శివరాత్రి మహోత్సవాలపై సమీక్షా సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కోటప్పకొండ మహా శివరాత్రి మహోత్సవాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి,
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, , చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నరు.

ఎన్నికల నియమావళి అమలులో ఉండటం వల్ల కోటప్పకొండలో భౌతికంగా సమావేశం నిర్వహించకుండా, సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రత, వసతులు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నదానం, వైద్య సదుపాయాలు, పండుగ ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహచర మంత్రి తో పల్నాడు జిల్లా ఎమ్మెల్యే లకు సూచనలు ఇచ్చారు.

భక్తుల భద్రత ప్రాధాన్యం
శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే కారణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీటి సదుపాయాలు, వైద్య సహాయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక అదనపు పోలీసు బలగాలను మోహరించి, భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రముఖ విఐపిల రాకపోకలు పై ప్రత్యేక యాత్రికులకు అసౌకర్యం కలగకుండా, విఐపిల రాకపోకలు సజావుగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *