అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరు గ్రామం నందు మరియు తూర్పు గోదావరి జిల్లా, పెరవలి మండలం, కానూరు అగ్రహారం నందు కోళ్ళు మరణిస్తున్నాయి అని తెలిసిన వెంటనే జిల్లాల పశుసంవర్ధక శాఖ వారు చనిపోయిన కోళ్ళ నుంచి సేకరించిన నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హై సెక్యురిటి యానిమల్ డిసీజేస్, ల్యాబ్ కు పంపగా వారు పరిశీలించి ఏవియన్ ఇన్ఫ్లూఎంజా వ్యాధి సోకినట్లు నిర్ధారించడం జరిగినది, చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్దతిలో ఖననం చేయడం జరిగినది. ఈ గ్రామాలకు ఒక కిలో మీటర్ ప్రాంతం మొత్తాన్ని ఎలేర్ట్ జోన్ గా (అప్రమత్తత పరిధిగా) ప్రకటించి నిర్దేశించిన ప్రామాణికాలను అనుసరించి తగు తక్షణ చర్యలు తీసుకోవడం జరిగినది. జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశము ఏర్పాటు చేసి పోలీసు, రెవెన్యు, అటవీ మరియు పశు సంవర్ధక తదితర శాఖలతో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ తక్షణమే వ్యాధి నివారణ చర్యలు తీసుకోవడం జరిగినది. మరియు ఈ గ్రామాలకు చుట్టుప్రక్కల 10 కిలో మీటర్ల ప్రాంతాన్ని సర్వైలన్స్ (Surveillance) ప్రాంతంగా ప్రకటించి, కోళ్ళు మరియు కోళ్ళ ఉత్పత్తుల రాకపోకలను కట్టడి చేయడం జరిగినది.
రాష్ట్ర మొత్తం మీద ఈ వ్యాధి పర్యవేక్షణకు 721 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ని, రాష్ట్ర సరిహద్దులలో కోళ్ళ, కోళ్ళ ఉత్పత్తుల రవాణా పర్యవేక్షణకు ఏర్పాటు చేసి, వ్యాధిపై పూర్తి నియంత్రణా కార్యక్రమాలు చేపడుతూ పశుసంవర్ధక శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని తెలియజేయడమైనది.
అదే విధముగా రాష్ట్రములో అధికంగా కోళ్ళు ఉన్న కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాలలో అదే విధంగా చెరువులు, సరస్సులు మరియు వలస పక్షులు వచ్చు జిల్లాలలో కూడా ఈ వ్యాధి ప్రబలకుండా రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేసి వ్యాధి పర్యవేక్షణ చేయడం జరుగుతోంది.
వ్యాధి ప్రభావం ఉన్న జిల్లాలలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగినది. ఎలేర్ట్ జోన్ ప్రాంతంలో మినిహా, మిగిలిన ప్రాంతాలలో ఉడకబెట్టిన గ్రుడ్లు మరియు మాంసాన్ని నిర్భయంగా నిస్సంకోసంగా తీసుకోవచ్చునని తెలియజేస్తున్నాము కావున మాంస ప్రియులు ఆందోళనచెందనవసరము లేదని తెలియజేయడమైనది.
Tags amaravathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News