Breaking News

ముమ్మరంగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకుంటున్న రైతులు

-యస్.డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్
-పొలం పిలుస్తోంది కార్యక్రమం వేదిక గా యూనిక్ ఐడి పై రైతులలో మరింత చైతన్యం
-బుధవారం ఒక్కరోజే 2 లక్షలు దాటిన నమోదు
-ప్రారంభించిన 3 వ రోజుకు 5 లక్షల సంఖ్య చేరువలో నమోదు కార్యక్రమం
-యునిక్ఐడి లో నమోదు – రైతులకు ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు కీలకం
-క్షేత్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులను ప్రత్యేకముగా అభినందన – ఇదే స్ఫూర్తి కొనసాగించాల్సిందిగా హితవు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొలం పిలుస్తోంది కార్యక్రమం వేదిక గా రాష్ట్రములోని వ్యవసాయ అధికారులు రైతులకు యూనిక్ ఐడి – విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు పై చేపట్టిన ప్రచార కార్యక్రమం పూర్తి స్థాయి లో సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ డిల్లీ రావు ఐఏఎస్ పత్రికా విలేకరులకు తెలిపారు. సోమవారం నుండి మన రాష్ట్రములో లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడవ రోజు సాయంకాలానికి 4,72459 రైతులలో నమోదు పూర్తి చేసుకుంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షల నమోదు(2,10,109) మైలు రాయిని దాటింది . డిల్లి రావు ,మాట్లాడుతూ 2025 -26 సంవత్సరం నుండి ప్రభుత్వ వ్యవసాయ పధకాలైన పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ, వడ్డీలేని పంట రుణాలు, పంటల బీమా, పంట రుణాలు,పెట్టుబడి సాయం, రాయితీపై వనరులు, సూక్ష్మ సేద్యం తదితర పథకాలను పారదర్శకంగా అమలుచేయడానికి ,రైతులు ఈ పథకాలలో లబ్ధికి రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ లో విశిష్ఠ గుర్తింపు సంఖ్య (యునిక్ ఐడి) కొరకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని రైతులను కోరారు.
ఈ విషయమై మాట్లాడుతూ సొంత భూమి కలిగిన ప్రతి రైతు వారి గ్రామ పరిధి లోని రైతు సేవా కేంద్రం లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ,ఆధార్ కార్డు ,పొలం పాస్ పుస్తకం, ఆధార్ లింక్ తో అనుసందానించబడిన ఫోన్ ను కలిగి వుండి,ఆంధ్ర ప్రదేశ్ రైతు రిజిస్ట్రీ పోర్టల్ లో వ్యవసాయ సహాయకులు ద్వారా నమోదు ప్రక్రియ చేసుకుని, 11 అంకెలు గల విశిష్ట గుర్తింపు సంఖ్య (యునిక్ ఐడి) ని పొందవలసినదిగా కోరారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *