Breaking News

“బడ్జెట్ లో విద్యుత్ శాఖకు ప్రాధాన్యత ఇవ్వాలి”

-మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టే బడ్జెట్ లో విద్యుత్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను కోరారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో గురువారం సచివాలయంలో మంత్రి గొట్టిపాటి సమావేశం అయ్యారు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖకు కేటాయింపుల పరంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్ శాఖ అనుబంధ విభాగాలకు సంబంధించిన కేటాయింపుల ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులకు అందజేశారు. మేనిఫెస్టో హామీలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కేటాయింపులు జరగాలని మంత్రి గొట్టిపాటి కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, ఆర్థిక శాఖకు సంబంధించిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *