Breaking News

దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం చంద్రబాబు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతిష్టాత్మక ఇండియా టుడే పత్రిక సర్వేలో చంద్రబాబు నాయుడు నాలుగో స్థానంలో నిలవడం మాకు గర్వకారణం. కేవలం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఐదో స్థానం నుంచి ఆయన నాలుగో స్థానానికి చేరుకోవడం సంక్షేమం కోసం ఆయన పడుతున్న శ్రమ, ప్రగతి సాధించడానికి పట్టుదలతో పనిచేస్తున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. కేవలం కొన్ని నెలల కాలంలోనే ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడం ప్రజలకు, పెట్టుబడిదారులకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.
ఐదేళ్లపాటు అన్ని రంగాల్లో విధ్వంసాన్ని చవిచూసిన రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పట్టా లెక్కించేందుకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమించడం అందరికీ ప్రత్యేకించి యువతకు కచ్చితంగా మార్గదర్శకం. ప్రజలకు వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటానికి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుండి నడిపిస్తున్నారు. వారి మార్గదర్శకత్వంలో మేం కూడా అన్ని విధాలుగా కష్టపడుతున్నాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆశయాన్ని ప్రభుత్వం త్వరలోనే చేరుకుంటుందని ఆశిస్తున్నామని మంత్రి కొలుసు పార్థ సారధి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *