Breaking News

సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యం లో క్రీడాంధ్రప్రదేశ్ సాకారం దిశగా అడుగులు

-డిల్లీ పర్యటనలో రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-కేంద్ర కార్మిక ఉపాధి క్రీడ యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-ఏప్రిల్ నెలలో ఏపిలో పర్యటించనున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ
-రాష్ట్రంలో ఇ-స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి మద్దతు కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
-రాష్ట్రంలో అన్ని నగరాలలో క్రీడ మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ 280.9 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని కేంద్రానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సిఫారసు.
-రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి రూ 42.62 కోట్ల రూపాయల ప్రాజెక్టు సహకారం అందించాలని మంత్రి ప్రతిపాదన.
-రాయచోటిలో జిల్లా స్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి.
-రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణానికి మంత్రి ప్రత్యేక దృష్టి

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో క్రీడాంధ్రప్రదేశ్ సాకారం దిశగా అడుగులు వేస్తున్నామని, ఇప్పటికే అత్యుత్తమ నూతన క్రీడా పాలసీ, క్రీడా యాప్ ఆవిష్కరణ వంటి అంశాలు కూటమి ప్రభుత్వం హయంలో జరిగాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా సెంటర్, జిల్లా స్థాయిలో ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు.

శుక్రవారం రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా,యవజన,క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రమంత్రి మాండవీయను కలిసి పూల బొకేతో సత్కరించారు. అనంతరం యువతకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారాలు అందించాలని కోరారు.

రాష్ట్రంలో క్రీడా సముదాయం ఏర్పాటు ద్వారా, “మల్టీపర్పస్ హాల్, అథ్లెటిక్స్ ట్రాక్, ఫుట్‌బాల్ ఫీల్డ్, స్విమ్మింగ్ పూల్” వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని. ఈ మౌలిక సదుపాయాలు కేవలం క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా, యువత అభివృద్ధి సమాజంతో అనుసంధానం చేస్తూ అవకాశాలను అందిస్తాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పట్టణాలు/నగరాలలో ప్రాథమిక క్రీడా మౌలిక సదుపాయాలు లేవని, ఈ నేపథ్యంలో మంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కొన్ని ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రంలో ప్రాథమిక క్రీడా మౌలిక సదుపాయాల స్థాపన కోసం ప్రతిపాదన బడ్జెట్ ను మంజూరు చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో అన్ని నగరాలలో క్రీడ మౌలిక సదుపాయాల నిర్మాణానికి 280.9 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని, రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి 42.62 కోట్ల రూపాయల ప్రాజెక్టు కు సహకారం అందించాలని, రాయచోటిలో జిల్లా స్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రాన్ని ఏర్పాటుకు చేసి రాయచోటి లో క్రీడా సముదాయ నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో నూతనంగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా సెంటర్, జిల్లా స్థాయిలో ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిల్లీలోనీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) కార్యాలయంలో కేంద్ర మంత్రికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, ఏప్రిల్ నెలలో ఏపీలో పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

రాయచోటి పై ప్రత్యేక దృష్టి

రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి 42.62 కోట్ల రూపాయల ప్రాజెక్టు సహకారం అందించాలని, రాయచోటిలో రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రాన్ని ఏర్పాటుకు చేసి రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రిని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా కోరారు.

దేశంలోనే ఇ-స్పోర్ట్స్‌కు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌లో ఇ-స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు.

– రాష్ట్రంలో స్థిరమైన ఇ – స్పోర్ట్స్ వ్యవస్థను నెలకొల్పడానికి రాబోయే నాలుగు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుండి ₹255 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని మంత్రి కోరారు. తద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఇ-స్పోర్ట్స్‌కు కేంద్రంగా చేయాలనే లక్ష్యంగా పని చేయడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

– క్రీడల జాబితాలో ఇ-స్పోర్ట్స్ చేర్చబడిందని, ఇ స్పోర్ట్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందుతున్నాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *