Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ తిరుపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ పద్మావతి మహిళా మహిళా విశ్వవిద్యాలయం నందలి 5.70 కోట్ల రూపాయలతో నిర్మించబడిన మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను బుధవారం (నేడు) మధ్యాహ్నం 2.15 గం.లకు ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, శ్రీ పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయం వి.సి. ఉమ, రిజిస్ట్రార్ రజినీ తదితరులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, తహశీల్దార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *