గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 21న (శుక్రవారం) సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు వర్కర్స్ గ్రీవెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు తమ సర్వీసు కు సంబందించిన సమస్యలు, కార్మికులు ప్రధానంగా పిఎఫ్, ఈఎస్ఐ, రుణాలు, ఆప్కాస్ తదితర అంశాలపై ఎదురవుతున్న సమస్యలపై అర్జీలను గ్రీవెన్స్ లో అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Prajavartha Online Telugu News