Breaking News

ఫించన్ల వెరిఫికేషన్ పారదర్శకంగా జరుగుతుంది

-రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో దివ్యాంగుల ఫించన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతున్నదని రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రతా ఫించన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందులో ఇప్పటి వరకూ 1.20 లక్షల ఫించన్ల వెరిఫికేషన్ పూర్తి అయినట్లు తెలిపారు. గతంలోని నియమ నిబందల ప్రకారమే ఈ ఫించన్ల వెరిఫికేషన్ జరుగుతున్నదని, అర్హులైన ఏ ఒక్కరికీ ఎటు వంటి అన్యాయం జరుగదన్నారు. ఒక జోన్ లోని వైద్యులు మరో జోన్ లో ఈ వెరిఫికేషన్ను ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎమ్.ఎస్.ఎం.ఈ.ల సర్వే కూడా ముమ్మరంగా సాగుతున్నదని, ఇప్పటి వరకూ 50 శాతం మేర సర్వే పూర్తయిందని, ఈ సర్వేకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తుది గడువు నిర్ణయించినట్లు మార్చి 15 కల్లా ఈ సర్వే పూర్తవుతుందని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *