Breaking News

రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్ధిని గెలిపించుకుందాం

-గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది
-అభివృద్ధిని గాలికొదిలి అప్పులమయం చేశారు
-రాజధాని, పోలవరం సహా పెట్టుబడుల్ని కూడా తరిమేశారు
-ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి.. ఇప్పుడు కూటమిపై కుట్రలు చేస్తున్నారు
-కూటమి అభ్యర్ధి గెలుపుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
-గుడివాడలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కొల్లు రవీంద్ర

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే కూటమి అభ్యర్ధి గెలుపు అత్యవసరమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడలోని నారాయణ కాలేజీలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీచింగ్ స్టాఫ్‌తో సమావేశమై.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని గెలిపించుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పడుతున్న తపన, శ్రమను గుర్తించి ఓటు వేయాలన్నారు.
2014లో విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృత నిశ్చయంతో పని చేశారు. పోలవరం, అమరావతి పనుల్ని శరవేగంగా పరుగులు పెట్టించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలనే లక్ష్యంతో పెట్టుబడుల్ని ఆకర్షించారు. వందలాది పరిశ్రమలు తెచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెట్టుబడుల్ని తరిమేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి బ్యారేజీగా మార్చే కుట్ర చేశారు. అమరావతిపై కుల ముద్ర వేసి నాశనం చేయాలనుకున్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాష్ట్ర ప్రజల్ని విడదీశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీశారు.
ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అధికారుల్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబును అరెస్టు చేయించి మళ్లీ గెలవాలని కుట్రలు చేశారు. కానీ, ప్రజలు జగన్ రెడ్డి అరాచకాలను గుర్తించి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 93శాతం సీట్లలో కూటమి అభ్యర్ధుల్ని గెలిపించి అభివృద్ధికి అండగా నిలిచారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి పని చేస్తోంది. అందుకే రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ మిర్చి యార్డుకు వెళ్లి రాద్దాంతం చేశాడు.
జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,800 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటించాం. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లను అందుబాటులో ఉంచుతాం. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు కూటమి అభ్యర్ధికి అండగా నిలుస్తున్నారు. చట్ట సభల్ని చుట్టబండలు చేసిన దుర్మార్గపు పాలన నుండి.. గౌరవ ప్రదమైన సభగా మార్చే బాధ్యత గ్రాడ్యుయేట్లపైనే ఉంది. రాజేంద్రప్రసాద్ గారి గెలుపు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుంది.
రాజకీయంగా అత్యంత ఘనమైన చరిత్ర కలిగిన కృష్ణా జిల్లాను గత ఐదేళ్ల పాటు నాశనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో అవినీతి మయం చ శారు. క్యాసినోలు, క్యాబరేలతో జిల్లా ప్రతిష్టను మసకబారేలా చేశారు. మహనీయులు పుట్టిన ప్రాంతాన్ని మసకబారేలా చేశారు.
ప్రజాశీర్వాదంతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.200 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు నిర్మించాం. గుంతలు లేని రోడ్లను తయారు చేశాం. గృహ నిర్మాణ పథకాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నాం. మచిలీపట్నం పోర్టు పనుల్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. మచిలీపట్నం-గుడివాడ రోడ్డును విస్తరిస్తున్నాం.
ఉద్యోగుల్ని పోలీసుల్ని బెదిరించడం జగన్ రెడ్డి అరాచకానికి నిదర్శనం. దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్టైన వంశీని పరామర్శకు వెళ్లడం సిగ్గుచేటు. పోలీసుల గుడ్డలు ఊడదీసి కొడతానని చెప్పడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి. 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన జగన్ రెడ్డిని ప్రజలు గుడ్డలూడదీసి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నా గానీ మేం ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు గారు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు, ఆంధ్ర ప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు గారు, మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ మరియు జనసేన మచిలీపట్నం ఇంచార్జ్ బండి రామకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *