Breaking News

టీబీ ముక్త్ పంచాయతీ క్లెయిమ్స్ వెరిఫికేషన్

-టీబీ ముక్త్ పంచాయతీ క్లెయిమ్స్ వెరిఫికేషన్ లో పాల్గొని..
-టీబీ రోగుల యొక్క వివరాలు, నిక్షయ్ పోషణ  యోజన, పోషకాహార కిట్లును పరిశీలించిన..
-డిప్యూటీ డి ఎం హెచ్ ఓ  డా. ఎన్. వసుంధర 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
టీబీ ముక్త్ పంచాయతీ క్లెయిమ్స్ వెరిఫికేషన్, జిల్లా వెరిఫికేషన్ టీం ద్వారా శుక్రవారం రంగంపేట మండలంలోని ఎస్.టీ .రాజపురం పంచాయతీ, రాజానగరం మండలంలోని సీతారామపురం పంచాయతీ మరియు కోరుకొండ మండలంలోని కాపవరం పంచాయతీల క్లెయిమ్స్ వెరిఫై చేయడం జరిగిందని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా. ఎన్. వసుంధర పేర్కొన్నారు. ఈ మూడు పంచాయతీలలో 2024వ సంవత్సరంలో నమోదు చేయబడిన టిబి నిర్ధారణ పరీక్షలు, నమోదు చేయబడిన టీబీ రోగుల యొక్క వివరాలు, నిక్షయ్ పోషణ యోజన, పోషకాహార కిట్లు మరియు 2023 సంవత్సరమునకు గాను ఔట్కమ్ లను పరిశీలించడం జరిగిందన్నారు.తదనంతరం కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలను టీబీ కళ్ళే పరీక్ష , కళ్లెను సరియైన విధానములో పట్టుట వంటి విషయాల పై ఆరా తీశారు, వారికి సరియైన పద్దతులను  వివరించారు. క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఈ పరిశీలన కార్యక్రమంలో డిఎన్ఎంఓ డా . ఎమ్ . హారిక, మెడికల్ కాలేజీ నుండి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం డా. సురేంద్ర, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, టీబీ సిబ్బంది , ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎస్ టీ రాజా పురం సెక్రటరీ యన్ . దినేష్ రెడ్డి, సీతారాంపురం పంచాయతీ సెక్రటరి పి ధనలక్ష్మి, కాపవరం పంచాయతీ సెక్రటరీ షేక్ అన్వరుల్ హుక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *