గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా శనివారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తనిఖీ చేసారు. సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలపై ఎక్స్ పైరీ తారీఖు దగ్గర పడుతున్నందున సకాలంలో తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇవియం ల పరిశీలనలో డిఆర్ఓ షేక్. ఖాజావలి, ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డి , గుంటూరు పశ్చిమ మండల తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి డిఈఈ రవీంద్ర బాబు , కలక్టరేట్ హెచ్ సెక్షన్ పర్యవేక్షకులు మల్లేశ్వరి , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News