Breaking News

వసతి గృహాల్లో విద్యార్ధులుతో సిబ్బంది పని చేయిస్తే కఠిన చర్యలు…

-ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో వసతి గృహంలో ఉండి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులుతో సిబ్బంది ఏ రకమైన పనులు చేయించినా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సంబంధిత అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల కాలంలో గురుకులాల్లో, బీసీ,సాంఘిక సంక్షేమ శాఖ, మోడల్ స్కూల్స్ మొదలగు వసతి గృహల్లో విద్యార్థులుతో సిబ్బంది చేయాల్సిన వంటపనులు,వసతి గృహ పరిశుభ్రత పనులు, టాయిలెట్స్ క్లీనింగ్, నీళ్ళు సేకరణ మొదలగు కార్యక్రమాలకు విద్యార్థుల్ని ఉపయోగించడం బాలల హక్కుల కమిషన్ దృష్టికి వచ్చిందని , ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. నిరుపేద ,బడుగు బలహనవర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే వసతి గృహంలో ఉంది విద్యను అభ్యశిస్తారని,వారిని చదువుకు దూరం చేసి సిబ్బంది వివిధ రకాలుగా విద్యార్థులచే అన్ని రకాలుగా చేయకూడని పనులు చేయించడం వలన వసతి గృహంలో కి పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు ముందుకు రారని ,ఇప్పటికే రాష్ట్రంలో చాలావరకు వసతి గృహాల్లు మూతపడ్డాయి అని వసతి గృహలపై సమాజానికి ఒక నమ్మకం కుదిరెలగా సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని అప్పారావు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఇంటర్ మరియు పదవ తరగతి ముఖ్యమైన తుది పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వారిపై ప్రత్యేకంగా ఆరోగ్యం, ఆహారం మరియు చదువు విషయాల్లో దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వారిపై ఏటువంటి శారీరక మరియు మానసిక ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు కు సిద్ధం చేయాలని సూచించారు. సిబ్బంది కొరత మరియు వసతి గృహాలు మరమ్మతులు,నూతన గదులు నిర్మాణం మరియు నిధులు మంజూరు గురుంచి ప్రభుత్వం ,సంబంధిత ఉన్నత అధికారులు దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *