Breaking News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ శెలవు మంజూరు చేయాలి

-శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగస్తులకు పోలింగ్ రోజు 27-02-2025 విధులకు హాజరు లో యాజమాన్యాలు తప్పనిసరిగా వెసులుబాటు కల్పించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గము శాసనమండలి ఎన్నికలకు ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ 27.02.2025 (గురువారం) ఉదయం గం.8.00 ని.ల నుండి సాయంత్రం గం.4.00 ని.ల వరకు జరుగుతున్నందున శాసనమండలి ఎన్నికల్లో ఓటర్లైన ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగస్తులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం అవకాశం కల్పించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. శ్రీయుత ముఖ్య ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఓటరు తన ఓటును వినియోగించుకొనుటను నిరోధించకుండా వుండేందుకు, సదరు పోలింగ్ రోజు అనగా తేది. 27.02.2025 (గురువారం) న అన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయములలో పనిచేయుచున్న ఉద్యోగస్తులలో అర్హత కల్గిన ఓటర్లు వున్నచో వారు ప్రత్యేక సాధారణ సెలవు (Special Casual Leave) ను వినియోగించుకొనుటకు అనుమతించాలన్నారు.

అలాగే అన్ని ప్రైవేట్ రంగంలోని వ్యాపార, వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలతో సహా ఉద్యోగస్తులలో ఎవరైనా అర్హత కల్గిన ఓటర్లు వున్నచో వారు సదరు పోలింగ్ రోజు అనగా తేది.27.02.2025 న వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొనుటకు వారి విధులకు ఆలస్యపు అనుమతిని (లేదా) షిఫ్ట్ ల సర్దుబాటు (లేదా) కొద్దిపాటి సమయం గైర్హాజరు అగుటను అనుమతించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *