Breaking News

రాష్ట్ర ప్రజలపై నియోజకవర్గ ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి… : MLA బొండా ఉమ

-మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్న శివాలయంలో నందు బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  సకుటుంబ సమేతంగా పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ… ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో  నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలలో మరియు అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఆ పరమేశ్వరుని అనుగ్రహం సెంట్రల్ నియోజకవర్గం పై ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *