-పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి
-ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు
-రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాష్ట్ర రెడ్డి
రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త :
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని, ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 1వ తేదీ శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… సర్వమతాల సారాంశం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన ప్రార్థనలు, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులుగా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి మూడు పూటలా నమాజ్ చేసుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలందరికీ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజులలో హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవించి అన్నమయ్య జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News