Breaking News

నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం, 2nd లాంగ్వేజ్ పేపర్ – II పబ్లిక్ పరీక్షలకు 28,783 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 28, 783 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 2nd లాంగ్వేజ్ పేపర్ – II పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 28,322 మంది, ఒకేషనల్లో 1,033 మంది మొత్తం 29,355 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా జనరల్లో 541 , ఒకేషనల్లో 31 మంది, మొత్తం 572 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *