Breaking News

వ్యవసాయ ఎగుమతులను పెంచేందుకు APMARKFED & NCEL మద్య ఒప్పందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం నుండి వ్యవసాయ ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (APMARKFED) మరియు న్యూడిల్లీకి చెందిన నేషనల్ కో-ఆపరేటివ్ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) మద్య వ్యూహాత్మకమైన అవగాహన ఒప్పందం (MOU) జరిగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో శ్రీ బుడితి రాజశేఖర్‌, ఐఏఎస్‌., ఎక్స్‌-ఆఫీసియో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, వ్యవసాయం, వ్యవసాయం) మరియు కర్రోతు బంగార్రాజు, చైర్మన్‌, ఏపి, మార్క్‌ఫెడ్‌ సమక్షంలో APMARKFED మేనేజింగ్ డైరెక్టర్ డా. మనజీర్‌ జిలానీ సమూన్‌, NCEL మేనేజింగ్ డైరెక్టర్ ఉనుపమ్‌ కౌసిక్‌ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని సహకార సంఘాలు మరియు రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి APMARKFED నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. జాతీయ స్థాయి ఎగుమతి ఏజెన్సీ అయిన NCEL కీలకమైన వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్ మరియు అంతర్జాతీయ మార్కెటింగ్‌ను సులభతరం చేస్తుంది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ప్రపంచ మార్కెట్ అవకాశాలను సృష్టించడానికి మరియు రాష్ట్రం నుండి వ్యవసాయ ఎగుమతులను బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం ఎంతగానో దోహద పడనుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *