Breaking News

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు కౌన్సిలర్స్ కు శిక్షణ కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక గుంటూరు V రాయల్ పార్క్ హోటల్ నందు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (APSACS) వారు రాష్ట్రంలో పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ICTC) కౌన్సిలర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని “SOCH & Data Management Training” పై నిర్వహించబడుతుంది.
ఈ శిక్షణ కార్యక్రమంలో కౌన్సిలర్లకు నేషనల్ ఎయిడ్స్ కార్యక్రమంలో (NACP) డేటాను నిర్వహించే విధానాన్ని, సోచ్(SOCH) నిర్వహణ డేటా నిర్వహణ NACO నిర్దేశించిన మార్గదర్శకాలు, రికార్డులను భద్రపరచు విధానం గురించి HIV-STI( సుఖ వ్యాధుల) కౌన్సిలింగ్, TESTING సేవలు నిర్దేశిత ICTC Modules, నాణ్యమైన సేవలు అందించుట మొదలైన అంశాలు పై ఈ శిక్షణా కార్యక్రమంలో కౌన్సిలర్లకు పూర్తి పరిజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుటకు మరియు నాణ్యమైన సేవలు అందించేందుకు కార్యక్రమం దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(APSACS) వారు ఈ శిక్షణ కార్యక్రమం అందరికీ ఇచ్చేందుకు 15 Batches వారీగా ఈనెల 22వ తేదీ వరకు ఇవ్వనున్నారు.
ఈ శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి Project Director, Dr.A. Siri, I.A.S, పాల్గొని కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అందించే సేవలు గురించి వాటి యొక్క విధివిధానాల గురించి తెలియజేసినారు మరియు Addl.Project Director, APSACS Dr.S.Sarasawathi శిక్షణ కార్యక్రమం ఆవశ్యకత అవలంబించాల్సిన విధివిధానాలు డేటాలను భద్రపరుచు విధానం గురించి తెలియజేసినారు. ఈ శిక్షణ కార్యక్రమానికి APSACS అధికారులు Dr. Srinivas Varma Deputy Director(BSD), Mr.M. Vijay Kumar Deputy Director(SI), Mr.A. Sukumar, WHO Consultant, Mr.M. Balajji, Assistant Director (SI), Mr.D.Saikumar DA (SI) తదితరులు ట్రైనర్స్గా వ్యవహరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *