Breaking News

లాటరీ ద్వారా షాపుల కేటాయింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ఎన్‌టిఆర్‌ జిల్లా గీతకులాలకు సంబంధించిన మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి విజయవాడ రూరల్, గొల్లపూడి బీసీ భవన్‌ లో ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించడమైనది. ఎన్‌టిఆర్‌ జిల్లా వ్యాప్తంగా అన్‌లైన్‌ ద్వారా మరియు ఆఫ్‌లైన్‌ ద్వారా 335 దరఖాస్తులు 11 మద్యం దుకాణాలకు రావడమైనది. లాటరీ ప్రక్రియ ద్వారా 11 మద్యం దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించడమయింది. 11 మద్యం దుకాణాలకు ప్రోవిజనల్‌ లైసెన్సు జారీచేయడం జరుగుతుంది. కార్యక్రమంలో ఎక్సైజ్అధికారులు టి.శ్రీనివాసరావు, ఎస్‌. శ్రీనివాసరావు, రామశివ మరియు ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *