Breaking News

నాపై అసత్య ఆరోపణలు చేసినందుకు పరువునష్టం దావా వేస్తున్నాను… : పేరం శివనాగేశ్వరరావు గౌడ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాపై అసత్య ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా చేస్తున్నాను… అని రిపబ్లిక్‌ అని పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎ) జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్‌ అన్నారు. స్థానిక గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో పేరం శివనాగేశ్వరరావు గౌడ్‌ మాట్లాడుతూ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అత్వాలే పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా పర్యటించటం జరిగింది. నెల్లూరు జిల్లా గ్రామ కాపురస్థులు మిరియాల వెంకట రామయ్య కల్చరల్‌ విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించటం జరిగింది. నెల్లూరు జిల్లా అంబేద్కర్‌ భవన్‌నందు కొంత మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై పత్రిక విలేకరులు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎ) అత్వాలే పార్టీకి సంబంధంలేని వ్యక్తి అయిన షేక్‌ మాబు అనే వ్యక్తి పేరం శివనాగేశ్వరరావు మా పార్టీ నుండి సస్పెండ్‌ అయిన 6 సంవత్సరాలు అయిందని, మరియు పార్టీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి విలేఖరులు సమావేశం ఏర్పాటు చేసి నా మీద తప్పుడు ఆరోపణలు చేయటం జరిగింది. ఈ యొక్క షేక్‌ మాబు గత పది సంవత్సరాల క్రితం రిపబ్లికన్‌ పార్టీ అంబేద్కర్‌ పార్టీలో కొనసాగుచున్నారని అన్నారు. నేను రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అత్వాలే పార్టీలో పార్లమెంట్‌ సభ్యునిగా 2019వ సంవత్సరం మైలవరం ఎమ్మెల్యే గాను, మరియు విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా (ఎంపీ)గా 2024వ సంవత్సరం అభ్యర్ధిగా పోటి చేయడం జరిగినది అని, కేంద్ర మంత్రి మరియు జాతీయ అధ్యక్షులు రామదాస్‌ అత్వాలే విజయవాడ మూడు సార్లు రావటం జరిగినది అని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నారా చంద్రబాబునాయుడు నాయకత్వం అవసరం వున్నది అని మేము కేంద్ర మంత్రి రామదాస్‌ అత్వాలే ఎన్డీఎ కూటమి భాగస్వామికి మద్దతి ఇవ్వటం జరిగినదిని షేక్‌ మాబు నెల్లూరు నుండి 2024వ సంవత్సరం రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుండి పోటీ చేయటం జరిగినది పాటిల్‌ గ్రూఫ్‌ షేక్‌ మాబు మా రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అత్వాలే పార్టీకి ఎటువంటి సంబంధం లేదు షేక్‌ మాబు మిరియాల వెంకటరామయ్య పై, నాపై అసత్య ఆరోపణలు చేసినందుకు షుమారు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నాను. తెలంగాణ హైకోర్టులో కేసు వేస్తున్నాను అన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి రమేష్‌కుమార్‌, ఏపీ కార్యదర్శిగోపి, కృష్ణాజిల్లా అధ్యక్షులు షేక్‌ సందీప్‌, అధికార ప్రతినిధి మల్లాది ప్రసాద్‌, తుమ్మలవెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *