గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, కలెక్టర్ల సదస్సు, స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర, పాజిటివ్ పబ్లిక్ పర్సిప్షన్, పీ4 సర్వే, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు అందించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ , నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ పాజిటీవ్ పబ్లిక్ పర్సిప్షన్ లో వివిధ శాఖల ఉద్యోగుల పనితీరుపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు సంబంధిత ఉద్యోగుల పనితీరు మెరుగుపర్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులతో మాట్లాడుతూ కలెక్టర్ల సదస్సుకు సంబంధించి అన్ని శాఖలు రాష్ట్ర స్థాయి కార్యాలయం జారీ చేసిన ఫార్మేట్ లో వివరాలను సిద్దం చేయాలన్నారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు మున్సిపల్, పంచాయతీ శాఖలతో పాటు విద్యా శాఖ విద్యా సంస్థల్లో, సంక్షేమ శాఖలో హాస్టల్స్, వైద్య ఆరోగ్యశాఖ ఆసుపత్రిలలో తదితర అన్ని శాఖలు నిర్దేశించిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. పాజిటీవ్ పబ్లిక్ పర్సిప్షన్ లో ఉద్యోగుల ప్రవర్తన పనితీరుపై ప్రజల నుంచి స్వీకరించిన అభిప్రాయాల మేరకు కేటాయించిన ర్యాంకులు మెరుగుపరచుకునేలా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల పరిధిలో జరుగుతున్న ప్రజలు, దాతలు, ప్రభుత్వం, భాగస్వామ్యం (పీ4) సర్వే వేగవంతం చేసి సత్వరమే పూర్తి అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ:-
సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా అధికారులతో కలిసి ప్రజలు, దాతలు, ప్రభుత్వం, భాగస్వామ్యం (పీ4) కార్యక్రమంపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించడానికి క్యూఆర్ కోడ్ తో రూపొందించిన ప్రచార పోస్టర్ లను ఆవిష్కరించారు. పోస్టర్లను అన్ని సచివాలయాల వద్ద ఏర్పాటు చేసి క్యూఆర్ కోడ్ ద్వారా పీ4 కార్యక్రమంపై ప్రజల నుంచి విస్తృతస్థాయిలో అభిప్రాయాలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ జ్యోతి బసు, హౌసింగ్ పీడి ప్రసాద్, జిజిహెచ్ సూపరింటెండెంట్ రమణ , పంచాయతీ రాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, ఉద్యాన శాఖ అధికారి రవీందర్, సిపిఓ శేషశ్రీ, జిల్లా మత్స్యశాఖ అధికారి గాలి దేముడు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, డ్వామా పీడీ శంకర్, డీపీఓ సాయికుమార్, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఈ కళ్యాణ చక్రవరి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోమలి పద్మ, మహిళాభివృధ్ధి శిశు సంక్షేమశాఖ అధికారి విజయలక్ష్మి. డీఈవో రేణుక, డిఎం అండ్ హెచ్ఓ డా.విజయలక్ష్మి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News