-రూ.1534 కోట్ల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ కి ఆమోదం
-స్టాండింగ్ కమిటి సమావేశానికి అధ్యక్షత వహించిన కమిటి సభ్యులు కొమ్మినేని కోటేశ్వరరావు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ ల వారీగా సమగ్రాభివృద్ధికి దోహదపడేలా, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా షుమారు 361 పనులకు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి ఆమోదం తెలిపిందని స్టాండింగ్ కమిటి సమావేశానికి అధ్యక్షత వహించిన కొమ్మినేని కోటేశ్వరరావు తెలిపారు. సోమవారం స్టాండింగ్ కమిటి సమావేశం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర మేయర్ హాజరు కానందున ఏపి మునిసిపల్ కార్పోరేషన్ యాక్ట్ 1955 ప్రకారం స్టాండింగ్ కమిటి సభ్యుల్లో ఒకరిని సమావేశానికి తాత్కాలిక అధ్యక్షులుగా ఎన్నుకోవచ్చన్న నిబందన మేరకు స్టాండింగ్ కమిటి సభ్యులు కొమ్మినేని కోటేశ్వరరావు ని అధ్యక్షులుగా మిగిలిన సభ్యులు ఏకాభిప్రాయంతో ఎన్నుకొని, నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు, అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో రూ.670.23 కోట్ల ప్రారంభ నిల్వ, రూ.864.04 కోట్ల జమలు అంచనాలతో రూ.1534.27 కోట్ల 2025-26 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.
సమావేశంలో స్టాండింగ్ కమిటి సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, దాసరి లక్ష్మీదుర్గ, ముప్పవరపు భారతి, నూకవరపు బాలాజీ, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమీషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎగ్జామినర్ నాగేంద్ర కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, సెక్రెటరి పి.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.