కార్మికులకు రేడియం జాకెట్స్, గ్లౌజులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారీ వెంబడి వ్యర్ధాలను తొలగించే కార్మికులు రేడియం జాకెట్స్, గ్లౌజులు ధరించి విధులు నిర్వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు బయాలజిస్ట్ రామారావు నేతృత్వంలో కాకాని జంక్షన్ నుండి బుడంపాడు జంక్షన్ వరకు కార్మికులు జాతీయ రహదారి వెంబడి ఉన్న వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి వ్యర్ధాలు గుట్టలుగా ఉంటున్నాయని, రాత్రి సమయాల్లో వ్యర్ధాలను వేసే వారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యర్ధాలకు కొందరు ఆకతాయిలు నిప్పు పెట్టడం వలన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతుందన్నారు. అలాగే ప్రధాన రహదారి వెంబడి కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు వేస్తున్నారని, ఆయా వ్యర్ధాల తొలగింపుకు నగరపాలక సంస్థ ప్రత్యేకంగా కార్మికులను కేటాయించుకొని చేస్తున్నామన్నారు. జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది కనుక విధులు నిర్వహించే కార్మికులకు రేడియం జాకెట్స్ అందిస్తున్నామని, వాటిని తప్పనిసరిగా ధరించాలన్నారు. ప్రజలు కూడా సహకరించి, వ్యర్ధాలను రహదారి వెంబడి వేయకుండా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బయాలజిస్ట్ రామారావు, ఎస్ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *