Breaking News

ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనాలి…

-క్రికెట్ తో పాటు వాలీబాల్ పోటీలు నిర్వహించాలి.
-మెగా కార్పొరేట్ క్రికెట్ టి 20 లీగ్ 2025. విజేత పోలీసు జట్టు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరు ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల ఓత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎస్ వి తారకరామ స్టేడియం నందు ఈ నెల 8 నుండి నిర్వహించిన మెగా కార్పొరేట్ క్రికెట్ టి 20 లీగ్ 2025 విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు.ఈనెల 8 నుండి 10 రోజుల పాటు మంచి వాతావరణం లో క్రికెట్ పోటీలు నిర్వహించడం, అందులో 10 జట్లు పాల్గొనడం జరిగిందన్నారు. క్రికెట్ తో పాటుగా వాలీబాల్ వంటి టోర్నమెంటులు జిల్లాలో ఎక్కువగా నిర్వహించాలని మెగా కార్పొరేట్ చీఫ్ ఆర్గనైజర్ చీర్ల కిరణ్ కు చూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆటల పోటీలలో పాల్గొనడం ఎంతయినా అవసరమైనదని తెలిపారు, చాలా చక్కగా ప్రతిభ కనబరిచిన ఫైనల్ విజేతలైన జిల్లా పోలీస్ జట్టు మరియు అమర్ రాజా ఇరుజట్లు కు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వై.అప్పారావు,రిజిస్టర్ భూపతినాయుడు,ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పి.సి.రాయల్ విజేతలైన విన్నర్,రన్నర్ జట్లు సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం విజేతలకు మెమెంటోస్ అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *