Breaking News

పదవ తరగతి పరీక్షలను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొల్లిపర లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో 224 మంది విద్యార్దులకు గాను వంద శాతం పరీక్షలకు హాజరైనారని మండల విద్యాశాఖాధికారి కె.ఝాన్సీ లత జిల్లా కలెక్టర్ కు వివరించారు. పరీక్షలు వ్రాస్తున్న విద్యార్దులకు కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ సూచనలు జారీ చేసారు. విద్యార్దులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను పరిశీలించి అందులో అందుబాటులో వుంచిన మెడిసన్ ను పరిశీలించారు. ఎండాకాలం అయినందున తగినన్ని ఓఆర్ఏస్ ప్యాకెట్లు అందుబాటులో వుంచాలన్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా పర్యవేక్షిస్తూ పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీలో కొల్లిపర తహశీల్దార్ సిద్ధార్ధ , యంపీడిఓ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *